ఫేస్ మాస్క్‌ల వినియోగంపై సూచనల జారీ
- April 13, 2020
బహ్రెయిన్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బయటి ప్రాంతాల్లో వున్నప్పుడు మాస్క్‌ల వినియోగం అవసరం లేదనీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. కరోనా వైరస్‌పై అవగాహన క్యాంపెయిన్‌లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ వ్యాఖ్యలు చేసింది. మాల్స్, స్టోర్స్, పబ్లిక్ ప్లేస్‌లు అలాగే వర్క్ ప్లేస్‌లలో మాత్రం మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. సరైన రీతిలో ఫేస్ కవర్ అయ్యేలా మాస్క్‌లు ధరించాలన్నది మినిస్ట్రీ చేసిన సూచనలో భాగం. ఫేస్ మాస్క్‌ని వినియోగించిన తర్వాత డిస్పోజ్ చేసే విధానంపైన కూడా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో పూర్తి వివరాల్ని పొందుపర్చారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







