కోవిడ్ 19: రెసిడెన్సీ, విజిట్ వీసాల గడువు ఈ ఏడాది చివరి వరకు పొడిగింపు
- April 14, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులకు, నివాసితులకు యూఏఈ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల వీసాలు, ఎమిరాతి ఐడీ, ప్రవేశ అనుమతుల గడువును ఈ ఏడాది చివరికి వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పౌరవ్యవహారాల గుర్తింపు ఫెడరల్ అధికార ప్రతినిధి కల్నల్ కమిస్ అల్ కాబి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. మార్చి 1 నాటితో గడువు ముగిసిన అన్ని రకాల వీసాలు, ప్రవేశ అనుమతి(ఎంట్రీ పర్మిట్లు) గడువును డిసెంబర్ 2020 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రవాసీయుల వీసా గడువును కూడా డిసెంబర్ వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్ తో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ప్రతి వ్యక్తి సంరక్షణ తమ బాధ్యతని అన్నారు. అయితే..ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చాలామంది ప్రవాసీయులు, పర్యాటకులు తమ దేశానికి వెళ్లిపోతామని విన్నపాలు వస్తున్నాయని, వాళ్ల అభ్యర్ధనలపై యూఏఈ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..