కువైట్:స్టెరిలైజర్స్ తయారీకి 1200 బ్యారెల్స్ ఇథనాల్ ను దిగుమతి చేసుకున్న
- April 14, 2020
కువైట్:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కువైట్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమైన నేపథ్యంలో దేశ ప్రజలకు స్టెరిలైజర్స్ (చేతులను శుభ్రం చేసుకునే రసాయనం) కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. డిమాండ్ కు సరిపడ స్టెరిలైజర్స్ తయారీ కోసం తొలి విడతగా దాదాపు 1200 బ్యారెల్స్ ఇథనాల్ ను దిగుమతి చేసుకుంది. మంత్రివర్గ సమావేశం 396 తీర్మానం మేరకు అందరికీ కరోనా నుంచి రక్షణ కల్పించే ఉత్పత్తులను అందుబాటులో ఉండాలన్న తీర్మానంలో భాగంగా ఇథనాల్ ను దిగుమతి చేసుకుంది. ఈ 1200 బ్యారెళ్ల ఇథనాల్ తో 500 మిల్లీ లీటర్ల చొప్పున ఒక్కో శానిటైజర్ ను తయారు చేయనున్నారు. దాదాపు మిలియన్ బాటిల్స్ తయారు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







