ఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న వారికి సుప్రీంలో తప్పని నిరాశ

- April 13, 2020 , by Maagulf
ఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న వారికి సుప్రీంలో తప్పని నిరాశ

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయటంతో భారత్కు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదోలా తమను తిరిగి భారత్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలకు వినతులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ కు ప్రాధాన్యత ఏర్పడింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు..కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులను తీసుకురావాలని కూడా ఆదేశించలేమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడ ఉండటమే అందరికీ శ్రేయస్కరమని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే..విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com