మస్కట్: 10 ఏళ్లకు పైబడిన వాహనాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు
- April 14, 2020
మస్కట్: పదేళ్లకు పైబడిన పాత వాహనాలకు కూడా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఒమన్ ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ఓ వాహనం మార్కెట్లోకి వచ్చి పదేళ్లు దాటితే దాని రిజిస్ట్రేషన్ కు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ వాహనాన్ని సాంకేతిక తనిఖీలు(ఫిట్నెస్ టెస్ట్) చేయాల్సి ఉంటుంది. వాహనం కండీషన్ లో ఉందని నిర్ధారించుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ ను రెన్యూవల్ చేయటం జరుగుతుంది. అయితే..కరోనా వైరస్ కారణంతో వాహనాల రిజిస్ట్రేషన్ ఆఫీసులో వినియోగదారుల సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే పదేళ్ల పురాతన వాహనాలకు కూడా ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఎలాంటి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన