ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
- April 15, 2020
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని ప్రభుత్వ జీఓను సవాలు చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ సైతం పిల్ దాఖలు చేశారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!