200 మంది తూ.గో జిల్లా సినీ కార్మికులకు సాయం!- గౌతం రాజు
- April 15, 2020
కరోనా లాక్ డౌన్ వేళ సినీకార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా సేవలందిస్తుండగా పలువురు పలు రకాలుగా సాయపడుతున్నారు. సీనియర్ నటుడు గౌతం రాజు తనవంతుగా 200 మందికి సేవలందించడం హర్షణీయం.
నటుడు గౌతం రాజు మాట్లాడుతూ-`` చాలా షూటింగులు తూగో జిల్లాలో జరుగుతాయి. రాజమండ్రి- యానాం- కాకినాడ - మండపేట- పిఠాపురంలో జరుగుతుంటాయ. కరోనా మహమ్మారీ వల్ల అక్కడ జూ.ఆర్టిస్టులకు పనుల్లేవ్. షూట్ లేకపోతే పొలం పనులు చేసేవారు. ధైన్యంగా ఉన్నారంతా. నాకు ఆర్థిక సాయం చేసేంత లేకపోయినా మా అబ్బాయి .. కొంత సాయం చేశాడు. అమెరికాలో నా మిత్రుడు శేషగిరి.. న్యూజెర్సీలో మురళి .. బిగ్ బజార్ సూర్య.. చంద్రకాంత్ రెడ్డి. భీమవరంలో నా తమ్ముడు మహేష్.. కాకినాడ కిరణ్ కుమార్ (నిర్మాత) తమవంతు సాయం చేశారు. కొండయ్య అనే జూ.ఆర్టిస్టు కం సప్లయర్ సాయంతో 200 మందికి సాయం చేయదలిచాం. కల్కి, గంగ, మల్లేష్ గౌడ్ తదితరులం రామచంద్ర పురం మొదలు పెట్టి ఆర్థిక సాయం చేశాం. వంద మందికి ఇప్పటికే సాయమందించాం. ఈ సలహా ఇచ్చిన మా అబ్బాయికి ధన్యవాదాలు. మన ప్రధాని ముఖ్యమంత్రులు మన ప్రాణాలు కాపాడేందుకు నియమనిబంధనలు పెట్టారు. నెలాఖరు వరకూ పాటిద్దాం. కరోనాను తరిమేద్దాం. సేవలు చేస్తున్న పోలీస్.. డాక్టర్లకు అందరికీ పాదాభివందనాలు`` అని తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..