విమానాలు మే 3 తర్వాతే.. కానీ ఇప్పుడే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు

- April 15, 2020 , by Maagulf
విమానాలు మే 3 తర్వాతే.. కానీ ఇప్పుడే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు

మస్కట్:భారత్ లో లాక్ డౌన్ గడువు అయిన మే 3 తర్వాతనే విమానాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ ఒమన్ నుండి భారత్ కు వెళ్లాలనుకునే వారు ఇప్పుడే ఆన్ లైన్ ఫారం నింపి పేరు నమోదు చేసుకోవచ్చని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ బుధవారం (15.04.2020) న ఒక ట్రావెల్ అడ్వయిజరీ (ప్రయాణ సలహా) ప్రకటన జారీ చేసింది. 

భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్ లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని  తెలిపారు. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. మనవారు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని ఆ ప్రకటనలో సూచించారు.

ఒమన్ నుండి భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్ సైటు లోని ఈ లింకు ను క్లిక్ చెయ్యండి.   https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform ఈ ఫారం యొక్క ఉద్దేశం  డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని ఎంబసీ ప్రకటన వివరించింది.

భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారు,  వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చేవారిలో చాలామంది చిన్న ఇండ్లు కలిగిన పేదవారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వయం నిర్బంధం) కొరకు విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు కాబట్టి జిల్లా కేంద్రాలలో తగినన్ని 'ఐసోలేషన్ సెంటర్లు' (వేరుగా వుంచు దిగ్బంధ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని భీంరెడ్డి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com