స్కామ్ ఈ-మెయిల్స్‌పై యాంటీ సైబర్‌ క్రైమ్ హెచ్చరిక

- April 16, 2020 , by Maagulf
స్కామ్ ఈ-మెయిల్స్‌పై యాంటీ సైబర్‌ క్రైమ్ హెచ్చరిక

మనామా:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ అండ్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ, స్కామ్ ఈ-మెయిల్స్‌ పట్ల హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్‌ కంపెనీ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఇ-మెయిల్‌ ద్వారా ఐడీ వెరిపికేషన్‌ అడుగుతున్నారనీ, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల్ని మోసం చేసేందుకు ఇలా ఇ-మెయిల్‌ స్కామర్స్‌ ప్రయత్నిస్తున్నారనీ, వ్యక్తిగత వివరాలు పొందుపర్చితే, బ్యాంక్‌ అక్కౌంట్లలో సొమ్ము మాయమవుతుందని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా ఫేక్‌ ఇ-మెయల్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఇ-మెయిల్‌ ఐడీలను పూర్తిస్థాయిలో పరిశీలించి, సంబంధిత సంస్థతో చర్చించాలని డిపార్ట్‌మెంట్‌ సూచిస్తంది. ఏ సంస్థ కూడా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కోరదని అధికారులు స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com