పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా! డెలివరీ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?
- April 16, 2020
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. అతనితో సంబంధం ఉన్న మరో 17 మంది డెలివరీ బాయ్స్, వాళ్లందరూ డెలివరీ ఇచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 72 మందిని గుర్తించి గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. నిర్బంధంలో ఉంచిన వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే వాళ్లను కలిసిన వాళ్లను కూడా క్వారంటైన్ కు తరలిస్తామని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. సంబంధిత రెస్టారెంట్ చేసిన కొన్ని డెలివరీలు జోమాటో ద్వారా జరిగాయని ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ జోమాటో ఒక ప్రకటన విడుదల చేసింది. "డెలివరీ సమయంలో రైడర్ సోకినట్లు మాకు తెలియదు" అని జోమాటో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా రోగులు సంఖ్య 1578కి చేరుకోగా 32 మంది మృతి చెందారు. భారత్ దేశంలో 12,760 మంది కరోనా వైరస్ సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1513 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







