యూఏఈ: కరోనా సంక్షోభంలో యజమాని మా జీతాలను తగ్గించొచ్చా? కార్మికుల సందేహాలపై న్యాయ సలహాలు
- April 19, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో పలు దేశాల్లో ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉంది. ఈ గడ్డు కాలాన్ని గట్టెక్కేందుకు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు, కార్మికుల జీతాలను కూడా తాత్కాలికంగా తగ్గిస్తున్నాయి. యూఏఈలోనూ పలు కంపెనీలు తమ కార్మికుల జీతాల్లో కొంతమేర కోతలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక వర్గాల నుంచి అనేక సందేహాలు నెలకొన్నాయి. కార్మికుల సందేహాలపై న్యాయసలహాలు మీ కోసం..
ఓ కార్మికుడి ప్రశ్న: నేను నిర్మాణ రంగంలోని ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాను. కాంట్రాక్ట్ భిన్నంగా మా యజమాని నా జీతంలో తాత్కాలికంగా 25 శాతం కోత విధించారు. దీనికి సంబంధించి ఎలాంటి కొత్త ఒప్పందం చేసుకోలేదు. పైగా జీతంలో కోత విధింపు ఎన్నాళ్లు అనేది కూడా స్పష్టం చేయలేదు. నేను ప్రస్తుతం అన్ని పని దినాల్లో పూర్తి పని గంటలు పని చేస్తున్నాను. మునుటి కన్నా ఇప్పుడు పని భారం ఏ మాత్రం తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా జీతంలో యజమాని
కోత విధించొచ్చా?
సమాధానం : కరోనాతో నెలకొన్న ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో నిస్సందేహంగా యజమాని కంపెనీపై ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవచ్చు. కోవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎమిరైజేషన్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవలె ఆమోదించిన తీర్మానం 279, 2020 మేరకు ప్రైవేట్ సంస్థలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ తీర్మానం ప్రకారం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా సంస్థ యజమాని కార్మికుల జీతాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది మంత్రివర్గ తీర్మానంలోని ఆర్టికల్ 2 (4) ప్రకారం చట్టబద్ధమే. పైగా మీరు యూఏఈ పౌరులు కూడా కాదు. అయితే..ఆర్టికల్ 5 నిబంధనల మేరకు మీతో ఒప్పందం చేసుకోకుంటే మాత్రం మీరు యజమాని నిర్ణయాన్ని మొహ్రేలో సవాలు చేయవచ్చు.
ప్రైవేట్ సంస్థలపై మాంద్యం ప్రభావం ఉంటే ఆర్టికల్ 2 ప్రకారం కంపెనీలోని ఉద్యోగుల జీతభత్యాలు, పనివేళలకు సంబంధించి విదేశీ కార్మికులతో ఒప్పందం మేరకు క్రమంగా ఈ క్రింది నిర్ణయాలు తీసుకోవచ్చు.
1. రిమోట్ వర్కింగ్ విధానాన్ని అమలు చేయటం.
2. జీతంతో కూడిన సెలవుల మంజూరు.
3. సెలవు రోజులకు సంబంధించి జీతంలో కోత విధించటం.
4. నిర్ధిష్ట కాలపరిమితికి వరకు జీతాల్లో కోత విధించటం.
5. శాశ్వతంగా జీతాల్లో కోత విధించటం.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా యజమాని కార్మికుడి జీతాల్లో కోత విధించాలంటే ఇద్దరి మధ్య ఒరిజినల్ ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ కు అనుబంధంగా తాత్కాలిక ఒప్పందం ఉండాలి. మంత్రివర్గ తీర్మానం మేరకు ఈ తాత్కాలిక అదనపు ఒప్పందంలో పేర్కొన గడువు ప్రకారం ముగుస్తుంది. లేదా ముందస్తు జాగ్రత్త చర్యలు వర్తించే కాలం ముగియగానే తాత్కాలిక ఒప్పందం రద్దవుతుంది. ఆర్టికల్ 5 మేరకు అదనపు తాత్కాలిక ఒప్పందానికి సంబంధించి రెండు కాపీలు ఇవ్వబడతాయి. ఒకటి కార్మికుడి దగ్గర ఉంటే..మరోటి యజమాని దగ్గర ఉంటుంది. అంతేకాదు అవసరమైన సందర్బాల్లో ఈ తాత్కాలిక ఒప్పందం కాపీని మొహ్రేకి సమర్పించాల్సి ఉంటుంది.
ఏదిఏమైనా జీతంలో కోత విషయంలో మీ యజమాని మీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని మీరు చెబుతున్నారు. మీరు చెబుతున్నదాని ప్రకారం మీ యజమాని ఆర్టికల్ 5 నిబంధనలను ఉల్లంఘించినట్టే లెక్క. పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు జీతంలో కోత విధించే అవకాశం యజమానికి ఉన్నా..ఎలాంటి కొత్త ఒప్పందం లేకుండా మీ జీతంలో కోత విధించటం మాత్రం కుదరదు. మీరు మీ యజమాని నిర్ణయంపై మొహ్రెలో ఫిర్యాదు చేయవచ్చు. అయితే..యజమాని, కార్మికుడికి మధ్య పరస్పర అవగాహన ఉంటే మాత్రం జీతంలో కోత విధించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు