మంత్రులు కె.టి.ఆర్‌, మ‌ల్లారెడ్డిల‌ను క‌లిసిన ముస్లిం మ‌త పెద్ద‌లు

- April 20, 2020 , by Maagulf
మంత్రులు కె.టి.ఆర్‌, మ‌ల్లారెడ్డిల‌ను క‌లిసిన ముస్లిం మ‌త పెద్ద‌లు

హైద‌రాబాద్‌:క‌రోనా వైర‌స్ నివార‌ణ‌లో ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ముస్లిం మ‌త పెద్ద‌లు తెలిపారు. సోమ‌వారం జిహెచ్‌ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యం నుండి జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించుట‌కు వ‌చ్చిన రాష్ట్ర పుర‌పాల‌క, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు, కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డిలు మేయ‌ర్ ఛాంబ‌ర్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటి మేయ‌ర్ మ‌హ్మ‌ద్ బాబా ఫ‌సియుద్దీన్‌ల‌తో వివిధ అంశాల గురించి చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో, ముస్లిం మ‌త పెద్ద‌లు ఖుబుల్ పాషా స‌త్తారి, ముఫ్తి ఖ‌లీల్ అహ్మ‌ద్‌, మ‌హ్మ‌ద్ పాషా, ఇఫ్తెకారి ఫాషాలు వ‌చ్చి మంత్రుల‌ను స్వ‌చ్చందంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం సంద‌ర్భంగా సామాజిక దూరాన్ని పాటించుట‌కై  త‌మ ఇళ్ల వ‌ద్ద‌నే అన్ని ప్రార్థ‌న‌లు నిర్వ‌హించాల‌ని ముస్లింల‌కు విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు వివ‌రించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని పూర్తిగా అరిక‌ట్టుట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలువ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మ‌హ‌మ్మారి నుండి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే ముందున్న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com