ఓవర్సీస్‌ సిటిజన్స్‌ కోసం 15 విమానాలు: జజీరా ఎయిర్‌ వేస్‌

- April 20, 2020 , by Maagulf
ఓవర్సీస్‌ సిటిజన్స్‌ కోసం 15 విమానాలు: జజీరా ఎయిర్‌ వేస్‌

కువైట్‌: జజీరా ఎయిర్‌ వేస్‌, ఆదివారం మొత్తం 15 విమానాల్ని విదేశాల నుంచి కువైట్‌ పౌరుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వినియోగించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైట్‌ పౌరుల్ని రప్పించేందుకు ఈ విమానాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జజీరా ఎయిర్‌వేస్‌ టెర్మినల్‌ (టి.5) సీఈఓ, కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ మానే అల్‌ మనీయా ఈ విషయాన్ని వెల్లడించారు. పౌరుల్ని తీసుకురావడంతోపాటుగా, మెడికల్‌ సప్లయ్స్‌ని కూడా ఈ విమానాలు తీసుకొచ్చాయి. మొత్తం ఐదు ఫేజుల్లో కువైటీ పౌరుల్ని స్వదేశానికి తీసుకురావాలని క్యాబినెట్‌ తీర్మానించింది. రెండో ఫేజ్‌ ఏప్రిల్‌ 23న, మూడో ఫేజ్‌ ఏప్రిల్‌ 25 నుంచి మే 1 వరకు, నాలుగో ఫేజ్‌లో మే 3 నుంచి 4 వరకు, ఐదో ఫేజ్‌లో మే 6 నుంచి 7 వరకు పేషెంట్స్‌, మెడ్స్‌ అలాగే లైఫ్‌ సపోర్ట్‌ ఎక్విప్‌మెంట్‌, విద్యార్థులు, డిప్లమాట్స్‌, ఇతర సిగ్మెంట్స్‌కి సంబంధించి తీసుకురావడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com