భారత్ లో 24 గంటల్లో 47మృతులు
- April 21, 2020
కరోనా కట్టడికి భారత్‌లో దాదాపుగా నెల రోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 1,336 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 18,601కి చేరుకుంది. 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 47 నమోదు కావడంతో మరణాల సంఖ్య 590కి చేరింది. ఇక వీటితో పాటు రికవరీ సంఖ్య కూడా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 3251గా నమోదైంది. దేశం మొత్తంలో వైరస్ బారిన పడుతున్న వారు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, మధ్య ప్రదేశ్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు