యూఏఈ:లోటో డిజిటల్ లాటరీ స్కీంలో తొలి వారం డ్రా ఫలితాలు విడుదల..

- April 21, 2020 , by Maagulf
యూఏఈ:లోటో డిజిటల్ లాటరీ స్కీంలో తొలి వారం డ్రా ఫలితాలు విడుదల..

యూఏఈలో ఫత్వా ఆమోదం పొందిన తొలి డిజిటల్ లాటరీ స్కీం 'ఎమిరాతి లోటో' తన తొలి వారం ఫలితాలను లైవ్ లో ప్రకటించింది. అయితే..తొలి ఫలితంలో ఒక్క నెంబర్ తో Dh35 మిలియన్ల జాక్ పాటు గెల్చుకునే అవకాశం మిస్ అయ్యింది. ఈ వారం ఎమిరాతి లోటో జాక్ పాట్ విన్నర్ నెంబర్లు  13, 20, 30, 44, 46, 49. అయితే..ఓ వ్యక్తికి బాల్ మిషన్లలో ఈ ఆరు నెంబర్లకుగాను ఐదు నెంబర్లు మ్యాచ్ అయ్యాయి. దీంతో అతనికి Dh350,000 ప్రైజ్ మనీ దక్కింది. మరో 43 మందికి క్యాష్ ప్రైజ్ దక్కింది. ఇక 1,204 మందికి ఆరు నెంబర్లలో మూడు నెంబర్లు మాత్రమే మ్యాచ్ కావటంతో వాళ్లను వచ్చే వారం డిజిటల్ డ్రాకు ఉచిత ఎంట్రీ లభించింది. ఈ వారం ఎవరూ జాక్ ప్రైజ్ మనీ Dh35 మిలియన్లు గెలుచుకోకపోవటంతో వచ్చే వారం జాక్ పాట్ ప్రైజ్ మనీకి మరో Dh 5 మిలియన్లు యాడ్ కానున్నాయి. దీంతో వచ్చేవారం ఎవరికైనా బాల్ మిషన్లో ఆరు నెంబర్లకు ఆరు నెంబర్లు మ్యాచ్ అయితే..వారు Dh40 మిలియన్లు గెల్చుకునే లక్కీ ఛాన్స్ ఉంటుంది. ఇదిలాఉంటే ఈ వారం ఎమిరాతి లోటో లాటరీ ఫలితాల వివరాలను లెబనీస్ టీవీ ప్రజెంటర్ విస్సమ్ బ్రీడీ, ఇండియన్ మోడల్, ప్రజెంటర్ ఐశ్వర్య అజిత్ లైవ్ లో అందించారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com