పాకిస్తాన్:ప్రధాని ఫౌండేషన్‌కు విరాళం అందజేసిన వ్యక్తికీ కరోనా..
- April 21, 2020
పాకిస్తాన్:సాయం చేస్తున్న చేతులకు కూడా కరోనా అంటుకుంటోంది. పాకిస్తాన్‌లోని అతి పెద్ద ఛారిటీ గ్రూపులలో ఒకటి ఈది ఫౌండేషన్. సంస్ధ అధినేత ఫైసల్ ఈధీ కరోనా వైరస్ బాధితుల సహాయార్ధం స్థాపించిన ప్రధాని కేర్ ఫండ్‌కు 10కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఆయనే స్వయంగా వచ్చి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెక్కును అందించారు. అయితే గత కొన్ని రోజులుగా అతను కరోనా బాదితులకు సహాయం అందిస్తూ ఉండడంతో అతడికీ కరోనా సోకినట్లు గుర్తించారు వైద్యులు.
కుటుంబసభ్యులతో పాటు అతడినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ని కలవడం వలన ప్రధానికి కూడా కరోనా టెస్ట్‌లు చేయదలచారు వైద్యులు. తీవ్రమైన జ్వరం తలనొప్పి రావడంతో ఈదీకి కరోనా టెస్ట్ చేశారు వైద్యులు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గృహనిర్భంధం చేశారు.
పాకిస్థాన్‌లో ఈదీ ఫౌండేషన్ అతిపెద్ద ఛారిటీ సంస్ధ. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ ఈదీ. మానవతావాది మరియు సామాజిక కార్యకర్త అయిన అబ్ధుల్ సత్తార్ ఈదీని స్థాపించారు. అతడిని పేదల తండ్రి అని దయాగుణానికి మారుపేరు అని అభివర్ణిస్తారు. నోబెల్ శాంతి బహుమతికి పలు సార్లు ఎంపిక య్యారు. తన సేవలకుగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అబ్దుల్ తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేశాడు.
ప్రసూతి ఆసుపత్రులు, అనాధాశ్రమాలు, ఆశ్రయాలు ఏర్పాటుకు ఛారిటీ సంస్ధ తరపున పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి అందజేశారు. జులై8, 2016లో మరణించిన అబ్దుల్ ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. అతని కుటుంబసభ్యులు కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







