COVID 19: తెరుచుకోనున్న దుబాయ్ మాల్స్...పాటించనున్న జాగ్రత్తలు
- April 23, 2020
మాల్స్ మరియు ఇతర వాణిజ్య ప్రదేశాలు తిరిగి తెరుచుకోనున్నాయి కానీ దుబాయ్ అధికారులు ఇంకా నిర్దిష్ట ప్రారంభ తేదీని ప్రకటించలేదు. ముందుగా ప్రజల్లో అవగాహన పెంచడానికి కొన్ని మార్గదర్శకాలను ప్రకటించారు.
దుబాయ్: మాల్స్ మరియు ఇతర రిటైల్ ప్రదేశాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఎప్పుడు తిరిగి తెరుస్తాయో ఖచ్చితమైన తేదీ తెలుపలేదు కాని "త్వరలో ప్రకటించబడుతుందని" కావున అధికారిక ప్రకటనల కోసం వ్యాపారాలు సిద్ధంగా ఉండాలని తెలిపిన అధికారులు. సేవలను తిరిగి ప్రారంభిన తర్వాత వాణిజ్య సంస్థలు పాటించాల్సిన అన్ని ఆరోగ్య మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లను ఈ సందర్భంగా విడుదల చేయటం జరిగింది. మాల్స్ లోని ప్రవేశ ద్వారాలను, టాయిలెట్స్ ను గంటలు శానిటైజేషన్ చేయటం జరుగుతుంది. మాల్స్ లోకి ప్రవేశించేవారికి తప్పనిసరి ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రజల భద్రత
మాల్స్ లో పనిచేసే సిబ్బందికి వ్యక్తిగత ఆరోగ్య భద్రత మరియు ప్రాంగణంలోని పరిశుభ్రతపై అవగాహన కల్పించటం జరుగుతుంది. ప్రజల భద్రతకు గాను మాల్స్ లోకి ప్రవేశించేవారికి ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహించి ఎవరికైనా కరోనా లక్షణాలు కనబరిస్తే వెనువెంటనే వారిని 'ప్రత్యేక ప్రదేశాలకు' పంపుతారు. ప్రతి మాల్ లో హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేయటం జరుగుతుంది. మాల్ కు వచ్చే ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని పేర్కొన్నారు. కస్టమర్లు 'ట్రయల్' చేయదలిస్తే ఆ దుస్తుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రతి కస్టమర్ ట్రయల్ తర్వాత శానిటైజేషన్ విధానాలను యాజమాన్యం పాటించనుంది. మాల్స్ లోని 'ఫుడ్ కోర్ట్స్' లో 'మెను కార్డులు', కుర్చీలను 75% ఆల్కహాల్‌తో శానిటైజేషన్ చేయటం జరుగుతుంది. డబ్బుకి బదులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరపాలని వినియోగదారులను కోరిన అధికారులు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ