వీటికి లాక్ డౌన్ ఎత్తేశారు...
- April 23, 2020
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో ఉత్పత్తులు ఆగిపోయాయి. దీంతో ప్రజలు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత దేశవ్యాప్తంగా ప్రజలు పడుతోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్‌డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. మొబైల్ రిచార్జ్, సిమెంట్, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. అదే టైంలో హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవు.
ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలు ఇవే... పుస్తకాలు, స్టేషనరీ షాపులు
నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు
మొబైల్ రిచార్జ్ షాపులు
రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు
సిమెంట్ విక్రయాలకు అనుమతి
పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం