బ్రాడ్‌ బ్యాండ్‌ ప్యాకేజీని ఆవిష్కరించిన వివా

- January 27, 2016 , by Maagulf
బ్రాడ్‌ బ్యాండ్‌ ప్యాకేజీని ఆవిష్కరించిన వివా

వివా సరికొత్త బిజినెస్‌ బండిల్‌ ప్యాకేజీని ప్రకటించింది. 10 బహ్రెయినీ దినార్స్‌తో అదనపు చెల్లింపులు లేకుండా 4జి నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తెచ్చింది. పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. బ్రాడ్‌ బ్యాండ్‌ రూటర్‌, 15 జిబి డేటా, 4 జి నెట్‌వర్క్‌, ఉచిత ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌ లైన్‌ నంబర్‌ మరియు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ (వివా నెట్‌వర్క్‌లోనే) వంటి ఆఫర్లను వివా ప్రకటించింది. వివాటు వివా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, వివా టు వివా అన్‌ లిమిటెడ్‌ ఎస్‌ఎంఎస్‌, ఇతర నెట్‌వర్క్‌లోని వాటికి 400 ఉచిత లోకల్‌ మినిట్స్‌ మరియు, 7 జిబి అన్‌లిమిటెడ్‌ నెలవారీ మొబైల్‌ డేటా కొత్త ప్యాకేజీల్లోని ముఖ్యాంశాలు. వివా క్లౌడ్‌ సర్వీస్‌ ద్వారా ఫుల్‌ వెబ్‌ ప్రెజెన్స్‌ మరియు డిజైన్‌, కస్టమైజ్‌డ్‌ ఆన్‌లైన్‌ డొమైన్‌ నేమ్‌ మరియు బ్యాకప్‌, ఇ-ఫ్యాక్స్‌ సర్వీసులను కూడా వివా బిజినెస్‌ వినియోగదారులు పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com