పోలీసులకు పీపీఈ కిట్స్ పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్
- April 24, 2020_1587734261.jpg)
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన సేవాతత్పరతని మరోసారి చాటుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కరోనాని ధీటుగా ఎదుర్కుని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తన వంతు తోడ్పాటుగా అత్యంత అధునాతనమైన, నాణ్యమైన పర్సనల్ ప్రొటక్షన్ ఎక్యూప్‌మెంట్ (పీపీఈ) కిట్స్‌లను పంపిణీ చేశారు.
గురువారం బషీర్‌బాగ్‌లో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌ని కలుసుకున్న అగర్వాల్ ఈ కిట్స్‌ని ఆయన సమక్షంలో అందజేశారు. పోలీసులకు ఇష్టమైన ఖాకీ రంగులో డిజైన్ చేసిన కిట్లు రూపొందించారు. దేశంలోనే ఈ తరహా కిట్స్ పోలీసులకు పంపిణీ చేయడం ఇదే ప్రధమం. ఇది వరకు ప్రముఖ యువ కథానాయకులు నిఖిల్, శ్రీవిష్ణు, సందీప్ కిషన్‌లతో కలిసి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లను అవసరార్థులకు అందించి ఆదుకున్నారు అభిషేక్.
ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడిగా `కార్తికేయ 2`,అడవిశేష్ `గూఢచారి 2`, అనుపమ్ ఖర్ ముఖ్యపాత్రలో కాశ్మీర్ ఫైల్స్, వీటితో పాటు అబ్దుల్ కలామ్ బయెపిక్ లను కూడా అభిషేక్ నిర్మించబోతున్నారు. తమిళం లో విజయవంతమైన ఆరువి" చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!