కోవిడ్ 19: కరోనా కట్టడిలో పరస్పర సహకారంపై యూఏఈ, భారత్ చర్చలు
- April 25, 2020
అబుధాబి:ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యూఏఈ, భారత విదేశాంగ మంత్రులు చర్చించారు. వైరస్ ను నియంత్రించేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మన్యం జయశంకర్ ఫోన్ లో సంభాషించారు. భారత్ తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న యూఏఈ భాగస్వామ్యం మరింత పటిష్టం అవ్వాలని అబ్దుల్లా బిన్ జాయెద్ అభిలాశించారు. కరోనా కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య బంధం రోజు రోజుకీ మరింత బలపడుతోందని, కరోన సంక్షోభ సమయంలోనూ రెండు దేశాల మైత్రికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరస్పర సహకారం కొనసాగిస్తుండటంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు భారత విశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరీక్షా కాలంలోనూ ఇరు దేశాల పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ తమ భాగస్వామ్యదేశాలతో కలిసి వాణిజ్య బంధాలను బలపర్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇదిలాఉంటే..ఈ సందర్భంగా ఇరు దేశాల అత్యున్నత స్థాయి అధికారులు అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రభావం..వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇరు దేశాల పరస్పర సహకారంపై సమీక్షించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







