ఢిల్లీ:NRIల మృతదేహాల తరలింపుపై నిషేధం లేదు..విదేశాంగ స్పష్టీకరణ
- April 25, 2020
ఢిల్లీ:ఎన్ఆర్ఐల మృతదేహాలను ఇండియాకు తరలించటంపై ఎలాంటి నిషేధం విధించలేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయితే..మృతదేహాల దేహాలను కార్గో విమానాల్లో ఇండియాకు తీసుకువచ్చేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, అందుకే తుది నిర్ణయంపై ఆలస్యం జరుగుతోందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ వెల్లడించారు. సమస్య పరిష్కారానికి తాము ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. తాను వ్యక్తిగతంగా కూడా ఫాలో అప్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్న సందర్భంగా అధికారులు విధి విధానాలను ఫైనలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు నెలకొనటంతో విదేశాల్లోని భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించటంపై కూడా ఇండియా నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. మృతికి కరోనా వైరస్ కారణం కాకున్నా..ఆ మృతదేహాలను అనుమతించేది లేదంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయోమయాన్ని తొలగించేలా భారత్ విదేశాంగ శాఖ మృతదేహాలను దేశంలోకి అనుమతించటంపై స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకు దురదృష్టవశాత్తు ఎవరైనా ఎన్ఆర్ఐలు చనిపోతే వారి మృతదేహాలను ప్యాసింజర్ విమానాల్లోనే భారత్ కు తరలించేవారు. ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయి. కానీ, విదేశాల నుంచి మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి కార్గో విమానాల్లో మృతదేహాల తరలింపుపై ఇప్పటివరకు ఎలాంటి మార్గనిర్దేశకాలు లేవు. అందుకోసమే తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మృతదేహాల తరలింపులో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ అభిప్రాయపడింది. ప్రస్తుతం అధికారులు ఇదే విషయంపై వర్కౌట్ చేస్తున్నారని..త్వరలోనే మార్గదర్శకాల ఖరారుకు తుదిరూపం ఇస్తామని మంత్రి మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







