లైంగిక సంపర్కం వల్ల వ్యాపించే వైరస్ 'జికా'

- January 28, 2016 , by Maagulf
లైంగిక సంపర్కం వల్ల వ్యాపించే వైరస్ 'జికా'

లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే వ్యాధి ఎయిడ్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిన బారినపడి ప్రతి యేడాది లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇపుడు కొత్తగా జికా అనే వైరస్ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఈ వైరస్ కరేబియన్‌ దీవులు, లాటిన్‌ అమెరికాలో పుట్టి అమెరికాలోకి ప్రవేశించి ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది. ఈ వైరస్‌ వల్ల వేల సంఖ్యలో బ్రెజిలియన్‌ పిల్లలు పుట్టుకతోనే అంగవైకల్యానికి గురవుతున్నారు. చర్మంపై దద్దుర్లు, జ్వరం, కండ్లకలక వంటి లక్షణాలు ఈ వైరస్‌ సోకగానే కనబడతాయి. ఈ వైరస్‌ ముఖ్యంగా దోమల వల్ల వ్యాప్తి చెందుతుందన్నది ఇప్పటి వరకు ఉన్న భావన. అయితే, శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లైంగిక సంపర్కం వల్ల ఈ వైరస్ సంక్రమిస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా.. శృంగారం వల్ల వ్యాప్తి చెందుతున్నదని రెండు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల తాహిటి (ఫ్రెంచ్‌ పోలినేసియా ద్వీపంలో ఒక భాగం) ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వీర్యంలో జికా వైరస్‌ స్పష్టంగా కనిపించిందట. అలాగే లైంగిక సంపర్కం ద్వారా తన భార్యకు జికా వైరస్‌ వ్యాప్తి చెందించానని మరో వ్యక్తి అంగీకరించాడట. దీంతో లైంగిక సంపర్కం కూడా జికా వైరస్‌ వ్యాప్తికి సహకరిస్తుందనే విషయాన్ని అమెరికాలో ఫ్లోరిడా వాసులు బలంగా నమ్ముతున్నారు. కాగా, ఈ విషయంపై అప్పుడే అందోళన చెందనవసరం లేదని, ఇప్పటికివి వదంతులు మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీనిపై వెంటనే విస్తృత పరిశోధనలు ప్రారంభించినట్టు ఐరాస వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com