స్వదేశానికి వెళ్ళేందుకు 100,000 కేరళీయుల సంసిద్ధత

- April 27, 2020 , by Maagulf
స్వదేశానికి వెళ్ళేందుకు 100,000 కేరళీయుల సంసిద్ధత

యూఏఈ:కేవలం 12 గంటల్లో 100,000 మంది కేరళీయులు, స్వదేశానికి వెళ్ళేందుకోసం రిజిస్టర్‌ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌కి సంబంధించి ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన కేరళీయులు స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు. అత్యధికంగా యూఏఈ నుంచి ఈ రిజిస్ట్రేషన్స్‌ ఎక్కువగా జరిగాయి. ‘’ వెబ్‌సైట్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. కేరళ ప్రభుత్వం ఈ కొత్త ఛానల్‌ని ఏర్పాటు చేసింది విదేశాల్లో చిక్కుకున్న తమవారి కోసం. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, వీరందరినీ త్వరలో ఇండియాకి తీసుకురానున్నారు. కేరళ ఎయిర్‌పోర్టుల్లో తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే కేరళీయులకు స్క్రీనింగ్‌ చేపడతామని, హోమ్ ఐసోలేషన్‌కి పంపిస్తామని, ప్రస్తుత గైడ్‌లైన్స్‌ ప్రకారం కొందరిని క్వారంటైన్‌కి పంపిస్తామని చెప్పారు. కాగా, పలు హాస్టల్స్‌, హోటల్స్‌, హాల్స్‌, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ని అలాగే ఫ్లోటింగ్‌ హౌస్‌బోట్స్‌ని కూడా ఇందుకోసం వినియోగిస్తారు. మొత్తం 2.5 మిలియన్‌ నాన్‌ రెసిడెంట్‌ కేరళీయుల్లో 90 శాతం మంది మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లోనే వున్నారు. మొత్తంగా 3 నుంచి 5 లక్షల మంది కేరళీయులు స్వదేశానికి రానున్నారనేది ఓ అంచనా.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com