మస్కట్:కోవిడ్ 19ని ఎదుర్కొనేందుకు నాలుగు పరికరాల రూపకల్పన
- April 27, 2020
మస్కట్:కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఒమన్ రాయల్ ఆర్డ్మ్ ఫోర్స్ కు చెందిన సాంకేతిక విభాగం నాలుగు పరికరాలకు రూపకల్పన చేసింది. స్టెరిలైజింగ్ రూమ్ (క్రిమిసంహారక గది), పేపర్స్ స్టెరిలైజర్, ట్రిపుల్ రెస్పిరేటర్, స్మార్ట్ ఫేస్ మాస్కులను రూపొంచింది. ఇందులో స్టెరిలైజేషన్ రూమ్ సంస్థలు, ఇతర కార్యాలయాల ప్రవేశ భాగంలో ఏర్పాటు చేసే మొబైల్ ఛాంబర్. ఈ ఛాంబర్ లోకి వెళ్లగానే క్రిమినాశన రసాయనాలతో స్టెరిలైజ్ చేస్తుంది. అంతేకాకుండా దీనికి అమర్చిన వైర్ లెస్ నెట్వర్క్ ద్వారా ఎంతమందిని స్టెరిలైజ్ చేశారనేది కూడా లెక్కలతో సహా నమోదు చేస్తుంది.
ఇక పేపర్స్ స్టెరిలైజేషన్...వైరస్ అంటుకున్న పేపర్లను శుభ్రం చేస్తుంది. ఈ పరికరం ద్వారా వెలువడే అల్ట్రా వయోలెట్ కిరణాలు పేపర్లపై ఉండే సూక్ష్మీజీవులను నశానం చేస్తుంది. ఇక స్మార్ట్ ఫేస్ మాస్క్ కరోనా పేషెంట్లకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా పేషెంట్లకు ట్రీట్ చేసిన తర్వాత పొరపాటున చేతిని ముఖంపైకి తీసుకొచ్చినా..స్మార్ట్ ఫేస్ మాస్క్ వారిని వెంటనే అలర్ట్ చేస్తుంది. ట్రిపుల్ రిస్పిరేటర్ పరికరం ద్వారా ఏకకాలంలో ఒకే పరికరం ద్వారా ముగ్గురు పేషెంట్లకు ఆక్సిజన్ అందించవచ్చు. ఒమన్ ఆర్డ్మ్ ఫోర్స్ లాబరేటరీలో ఈ నాలుగు పరికరాలను పూర్తి స్థాయిలో పరీక్షించామని, త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు