పోలీస్ గెటప్‌లో యువకులు: అనుమానితుల అరెస్ట్
- April 28, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పలువురు అనుమానితుల్ని ఓ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపింది. నిందితులు 20 నుంచి 23 ఏళ్ళ లోపు యువకులనీ, పోలీసులుగా తమను తాము చిత్రీకరించుకుంటూ, ఓ లేబర్ క్యాంప్‌లోకి దూసుకెళ్ళారని మినిస్ట్రీ పేర్కొంది. పోయిన మొబైల్ ఫోన్‌ని వెతుకుతున్నట్లు నిందితులు చెప్పారని మినిస్ట్రీ వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్, నిందితుల్ని గుర్తించడం జరిగిందనీ, అనంతరం వారిని అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. కాగా, మరో కేసులో ఓ బహ్రెయినీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గల్ఫ్ జాతీయుడ్ని భయాందోళనకు గురిచేసినట్లు నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







