కువైట్ లో భారత రాయబారిగా సిబి జార్జ్ నియామకం
- April 30, 2020
కువైట్:భారత ప్రభుత్వం పలు దేశాలలో కొత్త రాయబారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కువైట్ లోనూ భారత్ రాయబారిగా సిబి జార్జ్ ను నియమించింది. సిబి జార్జ్ 1993 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. కేరళాలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన ఆయన..విద్యార్ధి దశ దశ నుంచే ప్రతిభను చాటుతూ వచ్చారు. గ్రాడ్యూయేషన్, పోస్ట్ గ్రాడ్యూయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత 1993లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్న సిబి జార్జికి..గతంలో వాషింగ్టన్ డీసీతో పాటు పలు ఇస్లాం దేశాల్లో భారత్ రాయబారిగా విధులు నిర్వహించిన అనుభవం ఉంది. ఇస్లామాబాద్, రియాద్, దోహా, కైరో, తెహ్రాన్ లో భారత రాయబారిగా ఉన్నారు. ఎక్కువగా ఇస్లాం దేశాల్లో విధులు నిర్వహించాల్సి రావటంతో అరబ్ భాషలో డిప్లోమా కూడా చేశారాయన. ఇదిలాఉంటే..ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా టీ.ఎస్. తిరుమూర్తిని భారత ప్రభుత్వం నియమించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు