పని ప్రదేశాలలో కార్మిక వసతి గృహాల నిర్మాణం

- April 30, 2020 , by Maagulf
పని ప్రదేశాలలో కార్మిక వసతి గృహాల నిర్మాణం

యూఏఈ: కాంట్రాక్ట్ సంస్థలు వారి పని ప్రదేశాలలో కార్మిక వసతి గృహాలు ఏర్పాటు చేసుకోటానికి అనుమతి ఇచ్చిన మానవ వనరుల శాఖ. అయితే, అధికారులు నిర్దేశించిన నిబంధనలు మరియు వివరణలకు సంస్థలు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఈ వసతి గృహాలలో కార్మికులకు సురక్షితమైన సామాజిక దూరం కోసం తగిన స్థలాన్ని కల్పించాలి. వసతి గృహాలు పని చేసే చోట ఉండటంతో కరోనా మూలంగా రవాణా నిలిపివేసిన సమయంలో కార్మికులు వారి వారి గృహాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ వసతి గృహాలలో పరిశుభ్రత మరియు భద్రత చర్యలు నిర్దేశించిన మేర కంపెనీలు పాటిస్తున్నదీ/లేనిదీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారని మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com