అబుధాబి: సోషల్ మీడియాలో ముష్టి గ్యాంగ్ లు..చర్యల తప్పని హెచ్చరించిన పోలీసులు
- May 03, 2020
అబుధాబి:పవిత్ర రమదాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తే దేవుడి కృప ఉంటుందనే సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అడుక్కోవటం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించొచ్చని కక్కుర్తి పడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. యూఏఈలో బిచ్చమెత్తుకోవటం నేరమని..ఎవరైనా అడుక్కుంటున్నట్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే..పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఈజీ మనీ ముఠా కొత్త ఎత్తుగడకు తెరతీసింది. ఏకంగా ఎలక్ట్రానిక్ ముష్టికి పాల్పడుతోంది. వాట్సాప్ లాంటి సోషల్ మీడియాతో పాటు ఈ మేయిల్స్ ద్వారా బిచ్చమెత్తుకోవటం మొదలు పెట్టారు. కల్లబొల్లి కబుర్లు, జాలి కలిగించేలా దయనీయ కథనాలు అల్లి దాతల మనస్సు కరిగించే ప్రయత్నం చేస్తారు. రమదాన్ మాసం కావటంతో దేవుడి సెంటిమెంట్ ను కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి ఆన్ లైన్ బిచ్చగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా ఈ మెయిల్ పంపించినా..వాట్సాప్ కు మెసేజ్ పంపించినా వారి వివరాలను 999కి వెంటనే ఫోన్ చేసి కమాండ్ కంట్రోల్ రూంకి తెలియజేయాలన్నారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 8002626కి కూడా ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. లేదంటే 2828కి టెక్ట్స్ మెసేజ్ చేయటంగానీ[email protected]కి మెయిల్ చేసినా ఆన్ లైన్ బిచ్చగాళ్ల బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







