భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో..
- January 28, 2016
అత్యంత సంపన్నుల జాబితాలోని తొలి 50 స్థానాల్లో ముగ్గురు భారతీయులు స్థానం సంపాదించారు. ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు దక్కింది. ఎప్పటిలాగానే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 87.4 బిలియన్ డాలర్లుతో ప్రథమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెల్త్-ఎక్స్, బిజినెస్ ఇన్ సైడర్ సంయుక్తంగా రూపొందించిన జాబితాను గురువారం వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్లతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 16.5 బిలియన్ డాలర్లుతో 43వ స్థానం, సన్ ఫార్మాసిటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ 16. 4 బిలియన్ డాలర్లుతో 44వ స్థానంలో ఉన్నారు. స్పానిష్ వ్యాపారవేత్త అమానికో ఓర్టెగా గవోనా 66.8 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 60.7 బిలియన్ డాలర్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అమెజాన్ జెఫ్రె- 56.6 బిలియన్ డాలర్లు, యూఎస్ వ్యాపారవేత్త డేవిడ్ కోచ్- 47.4 బిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. కొత్త జాబితా ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 29 మంది బిలియనీర్లు ఉండగా.. చైనా నుంచి నలుగురు బిలియన్లు.. భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







