మస్కట్ : వైద్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ఏర్పాటు
- May 03, 2020
మస్కట్ లోని వైద్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రెండు కేంద్రాలు సీబ్ స్టేడియం హాల్, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లలో ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి రంజాన్ మాసం ముగిసే వరకు రక్తదానం చేయవచ్చని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి రోజు దాతలు రక్తదానం చేయవచ్చని..మహిళా దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే..రక్తదానం చేయాలనుకునే దాతలు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 94555648 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయటం ద్వారా వివరాలను నమోదు చేసుకొని వారికి కేటాయించిన సమయంలో వెళ్లి రక్తాన్ని దానం చేయాలి. కరోనా నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







