దోహా: రమదాన్ మాసంలో ఆహార పదార్ధాల నాణ్యతపై తనిఖీలు ముమ్మరం
- May 04, 2020
దోహా:పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించేలా దోహా మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్యాక్డ్ ఆహార పదార్ధాలు అమ్మే స్టోర్స్ తో పాటు ఆహార పదార్ధాల ఉత్పత్తి సంస్థలపై తనిఖీలు ముమ్మరం చేసింది. మున్సిపాలిటీలోని ప్రజా ఆరోగ్య విభాగం, వాణిజ్య, పారిశ్రామిక విభాగానికి చెందిన అధికారులు సంయుక్తంగా దోహాలోని పలు ప్రాంతాల్లో ఆహార పదార్ధాల నాణ్యాతను పరిశీలించేందుకు తనిఖీలు చేపట్టారు. గత నెలలోనూ దోహాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. 33 స్టోర్స్ నాణ్యత ప్రమాణాల నిబంధనలు ఉల్లంఘించాయని గుర్తించారు. అలాగే పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్యాక్డ్ ఫుడ్ ను సప్లై చేసే వాహనాలను కూడా తనిఖీలు చేపట్టి 15,000 వాహనాలను చెక్ చేశారు. ఇందులో రెండు వాహానాల్లోని ఆహార పదార్ధాల సరఫరాలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి వాటిని నిర్మూలించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







