12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన వారి పై నిషేధం

- May 06, 2020 , by Maagulf
12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన వారి పై నిషేధం

దుబాయ్‌: మాల్స్‌, రిటెయిల్‌ షాప్స్‌ మరియు సూపర్‌ మార్కెట్లలోకి 12 ఏళ్ళ చిన్నారులు అలాగే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ గ్రూపువారిలో తీవ్రత ఎక్కువగా వుండే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 15,192 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 146 మంది మృత్యువాత పడ్డట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. పెద్దవారు, అందునా పలు రకాల ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారిపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా, ఏప్రిల్‌ 22 నుంచి యూఏఈలో మాల్స్‌ తెరుచుకున్నాయి. అయితే కొన్ని నిబంధనలు ఇంకా అమల్లోనే వున్నాయి. మార్చి 23న మాల్స్‌, షాపింగ్‌ సెంటర్స్‌, కమర్షియల్‌ సెంటర్స్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com