కువైట్:జీతాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధం...కార్మిక చట్టాల్లో మార్పులు
- May 06, 2020
కువైట:కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధం అయ్యింది. అందుకు అనుగుణంగా కువైట్ మంత్రివర్గం కార్మిక చట్టాల్లో కీలక సవరణలను ఆమోదించింది. దీంతో ఇక ప్రైవేట్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు యాజమాన్యాలకు అవకాశం దక్కనుంది. అయితే..ఉద్యోగులకు ఇష్టం లేకుండా జీతాల్లో కోత విధించేందుకు మాత్రం వీలు లేదు. కార్మికుల సమ్మతంతోనే యాజమాన్యాలు జీతాల్లో కోత విధించే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న కువైట్ కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు, సంస్థలు...కార్మికులు, ఉద్యోగుల జీతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కోత విధించేందుకు వీలులేదు. కార్మికులు ఆమోదం తెలిపినా..శాలరీలను తగ్గించేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో పలు కంపెనీలు తమ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించి వాళ్లకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసేవారు. ఆ తర్వాత వారితో మళ్లీ కొత్తగా ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోనేవారు. ప్రస్తుత సంక్షోభ పరస్థితుల్లోనూ పెద్ద కంపెనీలతో సహా పలు సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో బలవంతంగా కోత విధించాయి. కొందర్ని తొలగించాయి. ఇంకొందరు ఉద్యోగులు కంపెనీ ఒత్తిడితో సెలవుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక చట్టాల్లో సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదించటాన్ని పలువురు పార్లమెంటేరియన్లు తప్పుబడుతున్నారు. తాము కార్మిక చట్టాల్లో మార్పులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







