రాష్ట్రాల్లో 6 పట్టణాల మ్యాపింగ్
- January 28, 2016
స్థానిక సంస్థల మాస్టర్ ప్లాన్‌కు ఉపయోగం దేశవ్యాప్తంగా తొలిదశలో 152 పట్టణాల మ్యాపింగ్ పూర్తి థాయ్‌లాండ్ అధికారులకూ మ్యాపింగ్‌లో శిక్షణ ఐఐఎస్ఎం అదనపు సర్వేయర్ జనరల్ గుర్జార్ వెల్లడి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ధర్మవరం, మదనపల్లి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, ఆదిలాబాద్, నల్గొండ పట్టణాలను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశామని ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శిక్షణ సంస్థ 'ఇండియన ఇనస్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్(ఐఐఎ్సఎం)' అడిషనల్ సర్వేయర్ జనరల్ యూఎన గుర్జార్ వెల్లడించారు. ఈ మ్యాపింగ్ స్థానిక సంస్థల మాస్టర్ ప్లాన్ తయారీకి బాగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. డిప్యూటీ సర్వేయర్ జనరళ్లు యూఎన మిశ్రా, ఎస్వీ సింగ్‌లతో కలిసి గురువారం ఎస్ఓఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. 'నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన స్కీమ్(ఎనయూఐఎ్స)' కింద దేశవ్యాప్తంగా 152 పట్టణాలను మ్యాపింగ్ చేశామన్నారు. శాటిలైట్ ఇమేజరీ, ఏరియల్ ఫొటోగ్రఫీ ఆధారంగా ఈ పట్టణాల భారీ మ్యాప్‌లను రూపొందించామన్నారు. ప్లానింగ్, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలతో చర్చించిన మీదటే వీటిని రూపొందించామని, ఈ మ్యాప్‌లలో పట్టణాల సరిహద్దులు, ఇతర హద్దులు, దేవాలయాలు, హైవేలు, రైల్వే ట్రాక్‌ల వంటివి స్పష్టంగా కనిపిస్తాయన్నారు. రెండో దశలో మరిన్ని పట్టణాలను మ్యాపింగ్ చేస్తామన్నారు. అదేవిధంగా మొదటిసారిగా థాయ్‌లాండ్ అధికారులకు కూడా మ్యాపింగ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రెండు అంశాలపై గతంలో అప్పటి భారత ప్రధాని మన్మోహనసింగ్, థాయ్‌లాండ్ ప్రధాని యింగ్లుక్ షినవత్రల మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరిందన్నారు. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌లోని 'యూథాంగ్' పట్టణ మ్యాపింగ్ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, థాయ్‌లాండ్ 'జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (జీఐఎ్సటీడీఏ)' సంస్థలు సంయుక్తంగా ఈ మ్యాపింగ్ చేస్తున్నాయన్నారు. ఇందు కోసం సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుందని, జీపీఎస్ ఆబ్జర్వేషన పాయింట్లను గుర్తించి, మ్యాపింగ్ చేస్తారని వివరించారు. ఈ ప్రాజెక్టు అక్టోబర్ నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. థాయ్‌లాండ్ సంస్థ జీఐఎ్సటీడీఏకు చెందిన ఏడుగురు అధికారులకు ఉప్పల్‌లోని ఐఐఎ్సఎంలో నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ఎంఓయూలోని రెండో అంశమని తెలిపారు. ముఖ్యంగా సర్వేయింగ్, టోపోగ్రాఫికల్ మ్యాపింగ్, ఫొటోగ్రామెట్రీ అంశాలపై ఫిబ్రవరి 1న ఈ శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స అండ్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇతర శాస్త్రవేత్తలు, థాయ్‌లాండ్ నుంచి జీఐఎ్సటీడీఏ మ్యాప్ ప్రొడక్షన్ డివిజన్ డైరెక్టర్ టాటియా, మరో అధికారిణి వారిపోర్న్ హాజరవుతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







