బాంబు పేలుడు-ఇద్దరు పోలీసుల మృతి :ఈజిప్టు
- January 28, 2016
ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని సినాయ్ ప్రావిన్స్‌లో పోలీసు వాహనంలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. అల్-అరిష్ నగరంలో పోలీసులు తమ వాహనంలో వెళ్తుండగా పేలుడు సంభవించిందని, ఇద్దరు పోలీసులు మృతిచెందారని దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతా దళాలు ఘటనపై విచారణ చేపట్టాయి. రెండు రోజుల క్రితం ఇదే నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో అయిదుగురు పోలీసులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో గత కొంత కాలంగా మిలిటెంట్ల దాడులతో విరుచుకుపడుతున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







