కర్నూలు పట్టణ పారిశ్యుధ్ద కార్మికులకు రీఫ్రెష్ మెంట్స్ పంపిణీ చేసిన శేఖర్ కమ్ముల

- May 06, 2020 , by Maagulf
కర్నూలు పట్టణ పారిశ్యుధ్ద కార్మికులకు రీఫ్రెష్ మెంట్స్ పంపిణీ చేసిన శేఖర్ కమ్ముల

లాక్ డౌన్ సమయంలో కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తున్న పారిశ్యుధ్ద
కార్మికుల కోెసం ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల నెలరోజుల పాటు బాదం
పాలు,మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.ఇప్పటికే గ్రైేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ
కార్యక్రమం ప్రతీరోజు సాగుతుంటే..కర్నూల్ పట్టణ పారిశ్యుధ్ద కార్మికులకు
కూడా ఇలాగే పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. దీని గురించి ఆయన
స్వయంగా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

‘‘Red zones, high alert ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ లైఫ్
రిస్క్ చేసి మరీ పని చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్, ఆ చుట్టూ ప్రాంతాలు
అయితే వార్ zone లా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇంత ఎండల్లో, పారిశుద్ధ్య
కార్మికులు రాత్రి పగలు యుద్ధం చేసినట్టు రెస్ట్ లేకుండా పని
చేస్తున్నారు.  వాళ్ళకి మనం ఏం చేసినా, తక్కువే. కానీ కుదిరిన దాన్లో ఏదో
ఒకటి చేయాలి అనిపించి, ఒక పని మొదలు పెట్టాం.
నెల రోజుల పాటు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి రోజు బాదం పాలు/
మజ్జిగ ఇస్తే, ఈ ఎండల్లో వడ దెబ్బ తగలకుండా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది
అనిపించింది. ప్రతిరోజు బాదం పాలు/ మజ్జిగ 1000 మందికి mrp మీద కొంచం
తగ్గించిన ధరకు సరఫరా చేయటానికి విజయ డైరీ  ముందుకొచ్చింది. North zone
ghmc అధికారులని, supervisors ని సంప్రదిస్తే, ఎక్కడెక్కడో పని
చేస్తున్న వీళ్ళకి సరఫరా చేసే బాధ్యత తీసుకున్నారు. వారం రోజులుగా ప్రతి
ఒక్కరికీ 11 గంటలకి వీటిని అందిస్తున్నారు. ఎక్కడెక్కడో పని చేసే 1000
మందికి  ప్రతి రోజూ అందించటం అంటే చాలా కష్టమైన పని. ఎంత వరకు success
అవుతుందో అని కొంచం భయమేసింది కానీ,  ghmc సిబ్బంది చాలా successful గా
కార్మికులకి మజ్జిగ/బాదం పాలు అందిస్తున్నారు. Thanks to them.

ఇది సాధ్యమే అని నమ్మకం కుదిరాక,  కర్నూల్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్ళతో
మాట్లాడి అక్కడ కూడా మొదలుపెట్టాం.అక్కడ కూడా కర్నూల్ మున్సిపల్ సిబ్బంది
విజయవంతంగా బాదంపాలు,మజ్జిగ అందిస్తున్నారు.వాళ్లకు కూడా ప్రత్యేక
కృతజ్ణతలు.

ఎవరికయినా interest ఉంటే.. మీ ఏరియా లో ఉండే విజయ డైరీ లేదా ఏదో ఒక
సంస్థతో మాట్లాడుకుని, ఆ ప్రాంతం అధికారుల ద్వారా పారిశుద్ధ్య
కార్మికులకో, వలస కార్మికులకో సపోర్ట్ చేయండి. ఒకరే ఖర్చు భరించలేకపోతే,
ఒక group form గా అయి, డబ్బులు collect చేసి అయినా చేయొచ్చు.’’ అని ఆయన
తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com