దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- May 07, 2020
దుబాయ్:తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రా మే 6న జరిగింది. ఈ డ్రాలో ముగ్గురు భారతీయ వలసదారులు విజేతలుగా నిలిచారు. 47 ఏళ్ళ అజిత్ నరేంద్రన్, 1 మిలియన్ డాలర్స్ విజేతగా నిలిచారు. అబుదాబీలో ప్రస్తుతం నివాసముంటున్నారు అజిత్ నరేంద్రన్. అబుదాబీలోని మారియట్ హోటల్లో పర్చేజింగ్ మేనేజర్‌గా నరేంద్రన్ పనిచేస్తున్నారు. కేరళకు చెందిన నరేంద్రన్, 3 ఏళ్ళుగా అబుదాబీలో నివసిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతం చాలా ప్రత్యేకంగా వుందనీ, ఈ గెలుపుని తాను నమ్మలేకపోతున్నానని అన్నారాయన. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ మోటర్ బైక్‌లు బహుమతిగా వరించాయి. ఓ వీజేత అబ్దుల్ జలీల్, స్వదేశానికి వెళ్ళారు. ఆయన కేరళకు చెందినవారు. రాజేష్ బాలన్ అనే మరో భారతీయుడు మోటో గుజ్జి ఆడాస్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో లాజిస్టిక్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!