కోవిడ్ 19: వేలాది మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు..48 గంటల్లో ఫలితాలు
- May 07, 2020
అబుధాబి :కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అబుధాబి లోని ముసఫా పారిశ్రామిక ప్రాంతంలో భారీగా వైరస్ నిర్ధారిత పరీక్షలను చేపట్టారు అధికారులు. అబుధాబి లోని వేలాది మంది నివాసితులకు, బ్లూ కాలర్ కార్మికులకు పెద్ద సంఖ్యలో వ్యాధి నిర్ధారిత పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో కొత్తగా టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. జాతీయ స్క్రీనింగ్ ప్రాజక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పరీక్షా కేంద్రంలో దాదాపు 3,35,000 మందికి పరీక్షలు నిర్వహించాలని అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ(సెహా) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పరీక్ష కేంద్రంలో రోజుకు పది వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉన్నట్లు సెహా ప్రతినిధులు వివరించారు. ముసాఫా ప్రాంతంలో ఉండే ఎవరైనా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవచ్చని తెలిపారు. అయితే...గత మూడు రోజులుగా సగటున 6 నుంచి 7 వేల మంది వరకు పరీక్షలు నిర్వహించుకునేందుకు వచ్చారని, 4000 మంది నాసికా(ముక్కు నుంచి సేకరించటం) పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రోజు రోజుకీ పరీక్షలు నిర్వహించుకునేందుకు వచ్చే కార్మికులు సంఖ్య పెరుగుతున్నా..ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అంతేకాదు..48 గంటల్లోనే పరీక్ష ఫలితాలను వెల్లడించటం ద్వారా పాజిటివ్ వ్యక్తులను వెంటనే గుర్తించే వీలు కలుగుతోందని, తద్వారా అతని నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడే వీలు దొరుకుతుందని అన్నారు.
పరీక్షా కేంద్రానికి వచ్చే వ్యక్తుల హెల్త్ హిస్టరీ, లక్షణాలను బట్టి గ్రీన్, ఎల్లో, రెడ్ అనే మూడు వర్గాలు గా విభజిస్తున్నామని సేహా వర్గాలు వెల్లడించాయి.యువకులు, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో పాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు, పాజిటివ్ వ్యక్తులతో సంబంధం లేని చేతికి ఆకుపచ్చ బ్యాండ్ వేస్తున్నారు. ఇక స్వల్ప లక్షణాలతో ఉన్న వారి చేతికి ఎల్లో బ్యాండ్ వేస్తున్నారు. వారికి నాసికా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎరుపు రంగు బ్యాండ్ వేస్తున్నారు. వారికి నాసికా పరీక్షలు నిర్వహించటంతో పాటు ఎక్స్ రే, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. లక్షణాల తీవ్రతను బట్టి అవసరం అనుకుంటే సదరు వ్యక్తిని పరీక్షా కేంద్రం నుంచి నేరుగా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు కూడా సేహా ప్రతినిధులు చెబుతున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు