కరోనాపై పోరాట యోధులకు గౌరవ సూచకంగా నీలి రంగు లైటింగ్ లో మెరిసిన అల్ మౌజ్ మస్కట్
- May 07, 2020
మస్కట్:కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వివిధ రంగాల సిబ్బందికి అరుదైన గౌరవం దక్కింది. మస్కట్ లోని సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా నిలిచే అల్ మౌజ్ మస్కట్ భవానంలో బ్లూ లైట్స్ వెలిగించి ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞత తెలిపారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, అలాగే రాయల్ ఒమన్ పోలీసుల సేవలకు గౌరవ సూచకంగా వరుసగా 10 రోజుల పాటు బ్లూ లైటింగ్ ప్రదర్శిస్తారు. ఇదిలాఉంటే పలు దేశాల్లో కరోనా వైద్య సేవల్లో పాలుపంచుకున్న దాదాపు 90 వేల మంది వైద్య సిబ్బంది ఇప్పటివరకు వైరస్ బారిన పడ్డారని అంతర్జాతీయ నర్సుల మండలి ప్రకటించింది. అయితే..ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అభిప్రాయపడింది. ఐసీఎన్ లో దాదాపు 130 సభ్యదేశాలు ఉంటే..20 మిలియన్ల నర్సులు సభ్యులుగా ఉన్నారు. అయితే..ప్రస్తుతం చెబుతున్న 90 వేల మంది లెక్క కేవలం 30 దేశాల నుంచి సేకరించిన అంచనాలు మాత్రమేనని ఐసీఎన్ తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు