భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
- May 07, 2020
భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారీ విజృంభిస్తోంది. 24 గంటల్లో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54 వేలు దాటింది. ఇప్పటివరకు 18వందల మందికి పైగా కరోనాతో చనిపోయారు. దాదాపు 16 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 37వేలు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 17వేలకు చేరువవుతున్నాయి. అక్కడ 650మందికిపైగా కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరున్నర వేలు దాటింది. ఇక్కడ కరోనాతో 400 మంది చనిపోయారు. ఢిల్లీలోనూ కేసుల సంఖ్య ఐదున్నరవేలు దాటింది. తమిళనాడులో ఒక్కరోజే దాదాపు 600 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. కేసుల సంఖ్య ఐదున్నరవేలకు చేరువలో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడువేల చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏపీలో 18 వందల 33కు చేరగా.. పంజాబ్, పశ్చిమబెంగాల్‌లో కేసుల సంఖ్య 15వందలు దాటిపోయాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







