ఒమన్:ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం అండ

- May 08, 2020 , by Maagulf
ఒమన్:ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం అండ

మస్కట్:కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం తన కార్యక్రమాలు నిర్వహించడంలో ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు. పైగా ఒమన్ లో నివసిస్తున్న భారతీయులకు మరింత చురుకైన సేవలను అందిస్తోంది. అత్యవసర సమయంలో ముందుగా సమయ నిర్ధారణ చేసుకొని నేరుగా కలవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు ఫోన్ నంబర్ లను ప్రత్యేకంగా కేటాయించింది. పాస్ పోర్ట్ పునరుద్ధరణ కోసం 79806929, ఏటేస్టేషన్ కోసం 93584040 కు సంప్రదించాలన్నారు.

మస్కట్ గాని ఇతర ప్రదేశాల్లో ఉన్న నిర్దేశిత శాఖల్లో ప్రపంచ కరెన్సీ మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ శాఖ గుర్తించనప్పటికీ ఫిబ్రవరి1 వ తేదీ 2020 తర్వాత జన్మించిన బిడ్డల  రిజిస్ట్రేషన్ ను తాత్కాలిక పద్ధతిలో అంగీకరించనున్నారు. అయితే, బిడ్డపుట్టిన విషయాన్ని ధృవీకరిస్తూ సంబంధిత వైద్యశాల ద్వారా లభించిన వర్తమానం చూపించిన పిదప రాయబార కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రానికోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com