వైట్ హౌస్ లో రెండో కరోనా కేసు
- May 09, 2020
అమెరికా దేశ అధ్యక్షుడి అధికార నివాసమైన శ్వేతసౌధంలో రెండో కరోనా కేసు నమోదైంది. అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా వైరస్ సోకిందని తేలటంతో ఆ దేశంలో సంచలనం రేపింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న కేటీ మిల్లర్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని.. అక్కడి అధికారులు వెల్లడించారు. గతంలో కూడా వైట్‌హౌస్‌లో ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది. అయితే, అప్పట్లో కరోనా సోకిన అధికారి పేరు వెల్లడించలేదు. కేటీ మిల్లర్ అనే యువతికి గతంలో ఒకసారి పరీక్షలు చేసినా.. నెగెటివ్ వచ్చిందని.. కానీ, కరోనా సోకినట్టు తేలిందని ట్రంప్ తెలిపారు. కేటీ మిల్లర్ తో తాను కలవలేదని, ఆమె ఉద్యోగరీత్యా ఉపాధ్యక్షుడితో కలుస్తుంటారని ట్రంప్ చెప్పారు. దీంతో అమెరికాలో ఆందోళన మొదలైంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!