దుబాయ్:నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టెట్ కంపెనీకి Dh50,000 జరిమానా
- May 09, 2020
దుబాయ్:నిబంధనలు ఉల్లంఘించి కంపెనీ ప్రమోషన్ చేసుకోవటంతో పాటు అనధికారిక లావాదేవీలకు పాల్పడుతున్న రియల్ ఎస్టెట్ కంపెనీలపై రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ- రేరా కొరడా ఝుళిపించింది. రియల్ ఎస్టెట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాయా? లేదా? తనిఖీలు చేపట్టిన రేరా..నిబంధనలు ఉల్లంఘించిన ఓ కంపెనీకి Dh50,000 జరిమానా విధించింది. రేరాలో నమోదుకానీ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ ప్రకటనలు చేయటంతో పాటు లిఖిత పూర్వకంగా లేని అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్లు రేరా గుర్తించింది. ఇన్వెస్టర్లతో కాంట్రాక్ట్ లు చేసుకున్న లావాదేవీలను నిబంధనలకు అనుగుణంగా నమోదు చేయలేదని కూడా రేరా తనిఖీల్లో తేలింది. దీంతో సదరు రియల్ ఎస్టెట్ కంపెనీపై జరిమానా విధించింది. అంతేకాదు కంపెనీ నాన్ కంప్లైంట్ ఉన్నట్లు నిర్ధారణ అయితే..జరిమానాను రెట్టింపు చేయటంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే రియల్ ఎస్టేట్ ఆఫీసును మూసివేయించి నిబంధనల ఉల్లంఘనపై న్యాయవిచారణకు సిఫార్సు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రియల్ ఎస్టెట్ సంస్థలు, బిల్డర్లు, బ్రోకర్లు అంతా పారదర్శకంగా ఉంటూ వినియోగదారులకు సేవ అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రియల్టర్లు ఎవరైనా మోసాలకు పాల్పడితే తక్షణ చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమను 8004488 సంప్రదించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







