'ది అదర్ ఇఫ్తార్'..ఇఫ్తార్ విశిష్టతను చాటుతూ తెరకెక్కిన చక్కని డాక్యుమెంటరీ

- May 11, 2020 , by Maagulf
\'ది అదర్ ఇఫ్తార్\'..ఇఫ్తార్ విశిష్టతను చాటుతూ తెరకెక్కిన చక్కని డాక్యుమెంటరీ

పవిత్ర రమదాన్ మాసం మానవత్వానికి ప్రతిబింబం.ఉన్నంతలో ఇరుగు పొరుగుతో పంచుకునే దాతృత్వం...కఠోర దీక్ష, కఠిన క్రమశిక్షణ, నిత్యం అల్లాను ప్రార్ధించే ధార్మిక చింతన ఇలా నిజమైన మనిషితత్వాన్ని మనకు పరిచయం చేసే పవిత్ర మాసం.రమదాన్ కు ఉన్న విశిష్టతను గొప్పగా తెరకెక్కించిన లఘు చిత్రమే 'ది అదర్ ఇఫ్తార్'. పేరులోనే రమదాన్ పరమార్ధాన్ని ఇఫ్తార్ విశిష్టతను ప్రజలకు అర్ధమయ్యేలా చాటిచెప్పాడు దర్శకుడు ఇమ్రాన్.రమదాన్ ఉపవాసం తర్వాత ఇఫ్తార్ విందుతో ఒకరికొకరు ఆహారం పంచుకుని ఆత్మీయతను చాటుకునే విధానాన్ని...ధనిక, పేద బేధం లేకుండా అంతా ఒక్కటిగా చేరి అల్లా ప్రసాదించిన ఆహారాన్ని పంచుకునే తీరులో ఉండే ప్రేమను చక్కగా విశదీకరించారు దర్శకుడు. ఇమ్రాన్ స్వస్థలం బెంగళూరు. ప్రస్తుతం దుబాయ్ లో మష్రూమ్ మీడియా పేరుతో ఫిల్మ్ మేకర్ గా చిత్రాలను నిర్మిస్తున్నారు.నిజానికి గత డిసెంబర్ లోనే ది అదర్ ఇఫ్తార్ మేకింగ్ పూర్తైనా..రమదాన్ మాసం సందర్భంగా ఈ టీజర్ ని అందిస్తున్నారు.పూర్తిగా యూఈలోని స్థానిక లోకేషన్లలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించటం ఈ చిత్రం మరో ప్రత్యేకత.డిసెంబర్ లో పూర్తి డాక్యుమెంటరీ ని దుబాయ్ లో ఎమిరేట్స్ ప్రీమియర్ షో లో ప్రదర్శించనున్నారు.అలాగే లిఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2020, ఫస్ట్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 2020లో కూడా ది అదర్ ఇఫ్తార్ కు చోటు దక్కింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com