మస్కట్:వినియోగదారులకు రమదాన్ తోఫా..
- May 12, 2020
మస్కట్:పవిత్ర రమదాన్ మాసంలో తమ వినియోగదారుల కోసం తగ్గింపు ధరలతో ఆఫర్ ప్రకటించింది ఒమన్ పోస్ట్ కంపెనీ. పోస్టల్ బాక్స్ సర్వీసులపై చార్జీలను 40 శాతం మేర తగ్గించింది.రమదాన్ మాసం ముగిసే వరకు సుల్తానేట్ పరిధిలో ఎక్కడికైనా పోస్టల్ బాక్సులను తగ్గింపు ఛార్జీలతో పంపించుకోవచ్చని ఒమన్ పోస్ట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమ కంపెనీ వినియోగాదారుల ఆదరణ పొందే లక్ష్యంతో నూతన మార్గాలను అన్వేషిస్తున్నామని, ప్రస్తుత కరోనా వైరస్ విపత్కర సమయంలో తమ సేవలను వినిగియోంచుకోవటం అత్యుత్తమమైన మార్గమని వారు చెబుతున్నారు. తమ కంపెనీ ద్వారా అన్ని రకాల పార్శల్స్ ను తమ బంధువులకు, మిత్రులకు, వ్యాపార భాగస్వామ్యులకు పంపించుకోవచ్చన్నారు. వారం 24 గంటల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటామని చెబుతున్న ఒమన్ పోస్ట్ సర్వీస్ ప్రతినిధులు..ఖచ్చితంగా నిర్ణీత సమయానికల్లా పార్శల్ ను అందజేస్తామన్నారు. అంతేకాదు..కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పార్శల్ బాక్సులను చేరవేయటంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా ఒమన్ పోస్ట్ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







