రానున్న రోజుల్లో మరింత కష్టం:WHO
- May 12, 2020
జెనీవా:రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలకు హితవు పలికింది. అశ్రద్ద వహిస్తే మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆంక్షలు సడలించిన దేశాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జర్మనీ, దక్షిణ కొరియాలో ఆంక్షల సడలింపుల అనంతరం నైట్ క్లబ్‌లు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేస్తోంది. లాక్డౌన్ అనంతరం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యవసర విభాగం చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు. ఆంక్షల సడలింపు అనివార్యం అయినప్పటికీ.. దశలవారీగా సడలించడం మరింత ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ అభిప్రాయపడ్డారు. పటిష్టమైన చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం చాలా ప్రమాదకరమని టెడ్రోస్ హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







