ప్రవాసీయులకు 3 నెలల గ్రేస్ పీరియడ్
- May 14, 2020
యూఏఈ: వీసా రద్దైన/గడువు ముగిసిన, వీసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ యూఏఈ లో ఉంటున్న ప్రవాసులందరికీ జరిమానాలు రద్దు చేస్తూ మే 18 నుండి మూడు నెలల గ్రేస్ పీరియడ్ నిర్ణయించినట్లు ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఎఫ్‌ఐఐసి) సీనియర్ అధికారి తెలిపారు.
ఎంట్రీ పర్మిట్లు మరియు రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్నవారితో సహా అన్ని నిర్వాసితులకు మినహాయింపు ఇస్తూ కాబినెట్ సమావేశంలో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఐఐసి అధికారి తెలిపారు. ఈ నిబంధన మార్చి 1 న లేదా తరువాత చట్ట పరంగా వీసా గడువు ముగిసినవాటికి మాత్రమే అని తెలిపారు.
"మే 18 నుండి మూడు నెలల వరకు ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్ పొందటానికి అన్ని నిర్వాసితులు FAIC పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. గడువు ముగిసిన ఎమిరేట్స్ ఐడిలు మరియు లేబర్ కార్డులకు సంబంధించిన అన్ని ఉల్లంఘనలు కూడా రద్దు చేయబడతాయి" అని బ్రిగేడియర్ అల్ కాబీ అన్నారు.
బుధవారం వరకు 1.5 మిలియన్లకు పైగా లావాదేవీలు FAIC పోర్టల్‌లో ప్రాసెస్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







