దుబాయ్ కింగ్ సంచలన నిర్ణయం..10 సంవత్సరాల వీసా మంజూరు
- May 14, 2020
దుబాయ్: కరోనావైరస్ ను ఎదిరించటంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యుల కృషికి దుబాయ్ రాజు దాసోహం అయిపోయారు. వారిని ప్రశంసిస్తూ దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) లోని వైద్య నిపుణులకు 10 సంవత్సరాల గోల్డెన్ రెసిడెన్సీ వీసా మంజూరు చేసి తన కృతఙ్ఞతలు తెలిపారు దుబాయ్ కింగ్ అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.
ఈ వీసాలు వివిధ స్పెషలైజేషన్ల 212 మంది వైద్యులకు ఇవ్వబడతాయి. ఈ నిర్ణయంపై దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి వైద్యులందరి తరపున షేక్ మొహమ్మద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది వైద్యుల ధైర్యాన్ని పెంచటమే కాకుండా వైరస్ సోకిన రోగులకు అత్యధిక నాణ్యమైన వైద్య సంరక్షణను అందించే ప్రయత్నాలలో వైద్యులను మరింత ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. యూఏఈ నాయకత్వం ఎల్లప్పుడూ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రపంచంలోని ఉత్తమ వైద్య ప్రతిభతో విజయాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను విస్తరించిందని కుతామి అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష







