బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎలాంటి వర్కవుట్స్ చేయాలీ ......
- January 29, 2016
బెల్లీ ఫ్యాట్ ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ బాన పొట్ట ఉన్న వాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ బెల్లీ ఫ్యాట్ కి కారణాలు, పరిష్కారాల కోసం వెతుకుతూనే ఉన్నారు. బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు లావుగా ఉన్న పొట్ట తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా.. పొట్ట మాత్రం తగ్గడం లేదని చాలా మంది ఫీలవుతూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి కారణాలేంటో ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాం. : బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించే న్యూట్రీషియన్స్ ఫుడ్స్ జిమ్ వెళ్తున్నాం కానీ ఫ్యాట్ మాత్రం కరగడం లేదంటూ ఉంటారు. కానీ ఎలాంటి ఎక్సర్ సైజ్ ల వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో ముందు తెలుసుకోవాలి. వెయిట్ ట్రెయినింగ్, కార్డియో వంటి వ్యాయామాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే మరో ముఖ్య విషయం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు... కానీ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ని మాత్రం మానేయలేకపోతారు. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఇలాంటి కారణాలే బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి అసలు రహస్యం. ఇంకా ఎలాంటి పొరపాట్ల వల్ల పొట్ట లావు తగ్గడం లేదో చూద్దాం. ప్రాసెస్ట్ ఫుడ్ లో ఎక్కువ బ్యాడ్ క్యాలరీస్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా బెల్లీలో వచ్చి చేరతాయి. చాలామంది ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి అడిక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాటికి బదులు న్యాచురల్ ఫుడ్ అయిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. అన్ని ఫ్యాట్స్ శరీరానికి హానికరం కాదు. మంచి ఫ్యాట్స్ శరీరంలో పేరుకున్న కొలెస్ర్టాల్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సాల్మన్ ఫిష్, అవకాడో, ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ సీడ్స్ లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ కి కారణమయ్యే బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్ ని తీసుకోవడం మానేసి.. మంచి ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎలాంటి వర్కవుట్స్ చేయాలో తెలుసుకుని వాటిపైనే ఫోకస్ చేయాలి. కార్డియో ఎక్సర్ సైజ్ లు, వెయిట్ ట్రెయినింగ్ వ్యాయామాల వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ రేట్ తగ్గుతుంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటారు. అలాంటి పొట్టను తగ్గించడం అంత ఈజీ కాదు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, గోధుమలు, ఫ్రూట్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ పైనే ఫోకస్ పెట్టే ఎక్సర్ సైజ్ లు చేయాలి. బెల్లీ ఫ్యాట్ కి మరో కారణం ఒత్తిడి. పని ఒత్తిడి, ఎమోషనల్ స్ర్టెస్ ఉంటే శరీరంలో కొర్టిసాల్ అనే స్ర్టెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల ఈ హార్మోన్ విడుదల జరగదు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు. రోజుకి 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతూ ఉంటే శరీరం ఈజీగా ఒత్తిడికి లోనవుతుంది. హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల నిద్రబాగాపడుతుంది. ఒత్తిడి, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. దాంతో తక్కువ నిద్ర కూడా పొట్ట పెరగడానికి కారణమవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎలాంటి ఉపయోగం లేదంటే మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం. హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. వీటికి చికిత్స తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి సహాయపడుతుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







